Krishna Prasad Sompally: ప్రతి భారతీయుడు దేశ ప్రతిష్టను కాపాడుతూ, అంబాసిడర్ లా ప్రవర్తిస్తే..
దీని వలన భారతీయత మరింత వెలుగొందుతుంది. ఎన్నో విలువలతో కూడిన సంప్రదాయాలు, సంస్కృతి వున్న నాగరికత గా, ప్రపంచ దేశాలలో పేరు తెచ్చుకొన్న భారతీయతను, కాపాడటమే కాకుండా, ఆ సంతతికి చెందినందుకు గర్వపడేలా, మన ప్రవర్తన ఆ దేశానికి వన్నె తెచ్చే లా వుండి తీరాలి..!
మనకంటే ముందు ఈ దేశానికి, వలసవచ్చిన మనవారు, మన భారతీయతను, మన దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన మాట వాస్తవం. ఇపుడు ఇది, మన బాధ్యత..!
మనమంతా గుర్తుంచుకోవలసిన అంశాలు:
* అమెరికా చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు.
* ట్రాఫిక్ నియమాలు నుండి వీసా నిబంధనల వరకు అన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి.
* అనుచిత ప్రవర్తన, మద్యపానం తరువాత వాహనం నడపడం, హింసాత్మక ప్రవర్తన వంటివి పూర్తిగా నివారించాలి.
* మన ప్రవర్తన ద్వారా భారతదేశం గర్వించేవిధంగా ఉండాలి.
* పాలు, అభిషేకాలు, ర్యాలీలు వంటివి చేయడం మంచిది కాదు.
“అమెరికా చట్టం ముందు అందరూ సమానమే. భారతీయులుగా మన కర్తవ్యం – భారత గౌరవాన్ని నిలబెట్టడం. మన దేశం మీద ముద్ర పడేలా కాకుండా, మన ప్రవర్తన ద్వారా ప్రపంచం భారతదేశాన్ని గర్వంగా చూడేలా చేసుకుందాం.”
Krishna Prasad Sompally, TANA International coordinator,
American School Committee Member













