సిలికాన్ వ్యాలీ కంటే అక్కడే ఎక్కువ
అమెరికాలో సిలికాన్ వ్యాలీ కంటే తూర్పు తీర ప్రాంతం, టెక్సాస్ మెట్రో ప్రాంతాల్లోనే ఎక్కువమంది హెచ్-1బీ వీసాదారులు ఉన్నారని ప్యూ సంస్థ తాజా పరిశోధనలో వెల్లడైంది. ఆ సంస్థ లెక్కల ప్రకారం, 2010-2016 మధ్య కాలంలో మొత్తం 8,59,600 వీసాలు జారీ కాగా వాటిలో 2,47,900 మంది న్యూయార్క్ మెట్రో ప్రాంతంలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు తెలిపింది. టెక్సాస్ మెట్రో ప్రాంతంలో పెద్ద సంఖ్యలో హెచ్-1బీ వీసాదారులు పనిచేస్తున్నట్లు ప్యూ నివేదిక పేర్కొంది. సిలికాన్ వ్యాలీ కేంద్రమైన శాన్‌జోస్‌లో 2010-16 మధ్య కాలంలో 22,200 మంది హెచ్-1 బీపై పనిచేశారని పేర్కొంది. డాలస్, వాషింగ్టన్ మెట్రో ప్రాంతాల్లో వరుసగా 74 వేలు, 64,800 మంది, బోస్టన్‌లో 38,300 మంది హెచ్-1బీ వీసాదారులు నివసిస్తున్నట్లు వెల్లడించింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విషయాల్ని వెల్లడించారు. టెక్సస్ కాలేజీ స్టేషన్ మెట్రో ప్రాంతంలో పనిచేసే ప్రతి వంద మందిలో 32 మంది హెచ్-1బీ వీసాదారులేనని, వారిలో 99 శాతం మంది అక్కడున్న కాగ్నిజెంట్ టెక్నాలజీ కార్పొరేషన్లో పనిచేస్తున్నారని తెలిపింది.













