పెరిగిన హెచ్ -1బీ వీసాల నిలుపుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో హెచ్ 1 బీ వీసాల జారీ భారీగా నిలిచిపోయిందని ప్రముఖ ఐటీ కంపెనీల యాజమన్యాల సంస్థ కంపీట్ అమెరికా వెల్లడించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలు సభ్యులుగా ఉన్న కంపీట్ అమెరికా, హెచ్ 1బీ వీసాల సంఖ్యలో ప్రభుత్వం భారీగా కోతపెడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) దాని సొంత నిబంధనలనే ఉల్లంఘిస్తున్నదని ఆ సంస్థ ఆరోపించింది. గత 18 నెలలుగా హెచ్ 1బీ వీసా దరఖాస్తులను భారీ సంఖ్యలో యూఎస్సీఐఎస్ వద్ద పెండింగ్లో ఉంచుతున్నారని, ట్రంప్ యంత్రాంగం ఆధ్వర్యంలో వీసాల న్యా విచారణ పద్ధతుల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయని కంపీట్ అమెరికా పేర్కొన్నది.













