వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యం లో ఫిలడెల్ఫియా లో మెగా రక్త దాన శిబిరం
డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి ఫౌండేషన్ (అమెరికా) వారి ఆధ్వర్యం లో వైఎస్ఆర్ ఎనిమిదవ వర్ధంతి సందర్భం పురస్కరించుకొని ఫిలడెల్ఫియా లో మెగా రక్త దాన శిబిరం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులుగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఫౌండేషన్ కోర్ కమిటీ సభ్యులు డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి గారు, ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఆళ్ళ రామి రెడ్డి గారు, వై ఎస్ ఆర్ సీపీ అమెరికా కన్వీనర్ రత్నాకర్ గారు, రీజినల్ ఇంచార్జి రమేష్ రెడ్డి గారు, నాట్స్ మాజీ అధ్యక్షులు గంగాధర్ దేసు గారు పాల్గొన్నారు. డాక్టర్ గోశాల రాఘవ రెడ్డి గారి ఆధ్వర్యం లో జరిగే ఈ రక్త దాన శిబిరానికి నాలుగు వందల మంది కార్యకర్తలు పాల్గొని రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించారు. నూట యాభై మంది రక్త దానం చేశారు.
ఈ కార్యక్రమం లో ట్రెజరర్ విష్ణు కోటంరెడ్డి, జాయింట్ సెక్రటరీ రఘురామి రెడ్డి ఏటుకూరి, శివ మేక, పూర్వ సెక్రటరీ హరి వెళ్కూర్, బోర్డు సభ్యులు ద్వారక వారణాసి, సహదేవ్ రెడ్డి, నాటా సెక్రటరీ శ్రీకాంత్ పెనుమాడ, వెంకటరామి రెడ్డి మరియు వై ఎస్ ఆర్ అభిమానులు మధు గొనిపాటి, విజయ్ పోలంరెడ్డి, తాతా రావు, శ్రీధర్ రెడ్డి తిక్కవరపు, రామ్ కళ్ళం, గీత దోర్నాదుల, రామమోహన్ రెడ్డి ఎల్లంపల్లి, నాగరాజా రెడ్డి, జగన్ దుద్దుకుంట, ఆనంద్ తొండపు. అంజి రెడ్డి సాగంరెడ్డి, రవి మరక, భానోజీ రెడ్డి, హరి కురుకుండ, వంశి బొమ్మారెడ్డి, ధీరజ్ రెడ్డి పాల్గొన్నారు.
Click here for Blood Drive Gallery













