గవర్నర్ అభ్యర్థికి లక్ష డాలర్ల విరాళం
మిషిగన్ రాష్ట్ర డెమొక్రాట్ గవర్నర్ అభ్యర్థిగా బరిలో ఉన్న గ్రెచిన్ విట్మర్ ఎన్నికల ఖర్చులు నిమిత్తం డెట్రాయిట్కు చెందిన ప్రవాస తెలుగువారు లక్ష డాలర్ల విరాళం అందించినట్లు గ్రెచిన్ భారతీయ వ్యవహారాల సమన్వయకర్త, చిత్తూరు ప్రవాసులు వడ్లమూడి వెంకటేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవాసాంధ్ర ప్రముఖుడు కాట్రగడ్డ కృష్ణప్రసాద్ నివాసంలో తెలుగువారితో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రెచిన్ పాల్గొన్నారు. కోగంటి ప్రతాప్, ముక్కామల అప్పారావు, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, వడ్లమూడి వెంకటేష్‌బాబు, హరినాథ్ పొలిచెర్ల, మాదాల విజయ్, నిమ్మగడ్డ శ్రీనివాస్ తదితరులు 40వేల డాలర్ల చెక్కును గ్రెచిన్ విట్మర్‌కు అందించారు,













