భారత రాయబారికి డొనాల్డ్ ట్రంప్ స్వాగతం
అమెరికాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధుకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతం పలికారు. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో తరణ్‌జీత్ తన అధికారిక వివరాలను అధ్యక్షుడికి అందజేశారు. ఈ సందర్భంగా తరణ్జీత్కు శుభాకాంక్షులు తెలిపిన ట్రంప్… రాయబార బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోదీతో ఉన్న అనుబంధాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్ష్వర్ధన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారా కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో ఆ స్థానంలో సంధు బాధ్యతలు చేపట్టారు. సంధు ఇప్పటి వరకు శ్రీలంకలో భారత హై కమిషనర్‌గా ఉన్నారు.













