అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆయన ఉత్తర కొరియా గడ్డపై అడుగుపెట్టారు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి అమెరికా అధ్యక్షుడయ్యారు. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే వెళ్లిన ట్రంప్ అక్కడ ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దు అయిన డీఎంజెడ్ వద్ద ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను కలుసుకున్నారు. ఆయనతో కరచాలనం చేసిన అనంతరం ఉత్తర కొరియా భూభాగంలోకి కొద్ది అడుగుల దూరం నడిచారు. కిమ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియాకు రావాల్సిందిగా కిమ్ కోరడం, నేను రావడం నాకెంతో గర్వంగా ఉంది అని ట్రంప్ అన్నారు. కిమ్‌ను కూడా అమెరికా పర్యటనకు రావాల్సిందిగా కోరినట్లు తెలిపారు. కాగా ట్రంప్ ఆహ్వానంపై కిమ్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ, కొరియాల విభజనకు సంకేతంగా ఉన్న ప్రదేశంలోనే తాము శాంతి కరచాలనం చేసుకోవడం.. గతాన్ని పక్కన పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి నిదర్శనమని ఈ సందర్భంగా కిమ్ వ్యాఖ్యానించారు.
20017లో ఉత్తర కొరియా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం, కిమ్, ట్రంప్ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురు కోవడంతో ఇరు దేశాల మద్య ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అణ్వస్త్ర నిరాయుధీకరణపై ఇద్దరు అధినేతలు ఇంతకుముందు రెండుసార్లు భేటీ అయినా ఫలప్రదం కాలేదు. ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన కూతురు ఇవాంకపై సరదా వ్యాఖ్యలు చశౄరు. ఒసార్ ఎయిర్ బేస్ వద్ద మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ ఇవాంకాను, విదేశాంగ మంత్రి మైక్ పాంపియోను బ్యూటీ అండ్ ద బీస్ట్ అంటూ వ్యాఖ్యానించారు.













