మాకింక చైనా అవసరం లేదు!
మాకింక చైనా అవసరం లేదు. నిజం చెప్పాలంటే వారి (చైనా) ప్రమేయం లేకుండానే మేం మెరుగైన ప్రగతి సాధించగలం. చైనాకు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలని మా దేశ కంపెనీలను ఆదేశించాం. ప్రత్యామ్నాయం లభించకపోతే వెనక్కి వచ్చి సొంత గడ్డ పై నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని సూచిస్తున్నాం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. చైనాకు చెందిన హువై సంస్థతో కూడా తామెటువంటి వాణిజ్య కార్యకలాపాలూ కొనసాగించబోమని ఆయన మరో ట్వీట్లో పేర్కొన్నారు. తమ దేశానికి చెందిన ఫెడెక్స్, అమెజాన్, యుపిఎస్, పోస్టాఫీస్ వంటి అన్ని సంస్థలనూ చైనా నుండి వెనక్కి తిరిగి వచ్చేయాలని ఆదేశిస్తున్నామని ట్రంప్ తెలిపారు. గత రెండున్నరేళ్లుగా అమెరికన్ ఆర్థిక వ్యవస్థ అద్భుత స్థాయిలో మెరుగుపడిందని, చైనా కన్నా మెరుగైన దశలో వుందని, ఇదే పరిస్థితిని కొనసాగిస్తామని ఆయన తెలిపారు.













