ఇది అత్యంత మోసపూరిత ప్రపంచం : ట్రంప్
ఇది అత్యంత మోసపూరిత ప్రపంచం. చాలా దుర్మార్గమైనది. ఎటుచూసినా అబద్ధాలు, వెన్ను పోట్లు, మోసాలే అంటూ శ్వేతసౌధంలో తన 20 నెలల అనుభవాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. మీడియాకు అసలు నిజాయతీనేలేదని తెలుసుకున్నట్లు తెలిపారు. ప్రముఖ టీవీ ఛానెల్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. మాన్హట్టన్ రియల్ ఎస్టేట్ దిగ్గజాలను అత్యంత కఠినమైనవారని ఎప్పుడూ చెప్పేవాణ్ని. ఇక్కడ రాజకీయ నాయకులను చూస్తుంటే, వారంతా పిల్లల్లా అనిపిస్తున్నారు. ఇది నాకు అత్యతం ఆశ్చర్యం కలిగించిన పరిణామం అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థే ప్రజలకు దగ్గరకు చేరుస్తోంది. ఒబామా సమయంలో అంతా చెల్లాచెదురుగా ఉండేది. నేడు అమెరికా ఐక్యంగా మారుతున్నట్లు కచ్చితంగా చెప్పగలను అని ఆయన అన్నారు.













