ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలను పొట్టబెట్టుకున్న వారికి అంతం తప్పదని హెచ్చరించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆయన సంతాపం తెలిపారు. బ్రిటన్ ప్రజలకు తాము అండగా ఉంటామన్నారు. పాలస్తీనా పర్యటనలో ఉన్న ట్రంప్ మాట్లాడుతూ అంతమంది యువత ప్రాణాలు తీసిన వారు గొప్పగా అనుకుంటున్నారు. కానీ వారికి రోజులు దగ్గరపడ్డాయి. ఈ సమాజంలో ఉగ్రవాదం, జాతి వివక్షను తుదముట్టించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో అన్ని దేశాలు చేతులు కలపాలి అని అన్నారు.













