భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా : ట్రంప్
భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా భారత్, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ ఆహ్వానంపై ట్రంప్ ఈ నె 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. గుజరాత్లోని అహ్మదాబాద్ కూడా వెళ్లనున్న ట్రంప్.. అక్కడ కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోదీతో కలిసి పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్ష నివాసం శ్వేత భవనం వద్ద ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ మోదీ గొప్ప వ్యక్తి అని, భారత్కు వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. భారత్తో సరైన ఒప్పందం చేసుకోగలిగితే.. తాను దానిపై సంతకం చేస్తానని తెలిపారు.













