భారత్ సుంకాలు మాకొద్దు : ట్రంప్
అమెరికన్ ఉత్పత్తులపై భారత్ సుంకాలు విధించడం తమకు ఏ మాత్రం సమ్మతం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. జీ 20 సమావేశాలకు హాజరైన సమయంలో ఉభయ దేశాల మధ్య వాణిజ్యపరమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రధాని మోదీతో ఒక అంగీకారానికి వచ్చిన కొద్ది రోజులకే ఆయన ఈ హెచ్చరిక చేశారు. భారత్ ఎంతో కాలం నుంచి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తోంది. ఇక అది మాకు ఏ మాత్రం సమ్మతం కాదు అని ట్రంప్ ట్వీట్ చేశారు. కాగా భారత్ ఫోకస్‌గా ఈ వారాంతంలో వాషింగ్టన్ డీసీలో జరగనున్న సదస్సులో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్, ఇంధన మంత్రి రిక్ పెర్రీ ప్రసంగించనున్నారు.













