కొత్త పాలసీతో ఐటీ కంపెనీలకు కష్టాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను అనుకున్నట్లే హెచ్-1బీ వీసాజారీ ప్రక్రియలో కొత్తగా పలు కఠినమైన మార్పులను చేసింది. దీనికి సంబంధించిన పాలసీని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా చేసిన మార్పుల ప్రకారం హెచ్-1బీ వీసా అభ్యర్థికి సంబంధించిన అదనపు వివరాలను దరఖాస్తు సమయంలోనే ఇవ్వాల్సి ఉంటుంది. అమెరికాలో ఉన్న కంపెనీల్లో ఎంతకాలం పనిచేసేందుకు అభ్యర్థికి హెచ్-1బీ వీసా కావాల్సి ఉంటుందో దరఖాస్తు సమయంలోనే చెప్పాల్సి ఉంటుంది. మూడేళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఉండేలా ఈ నిబంధన ఉంది. ఏప్రిల్ రెండో తారీఖు నుంచి హెచ్-1బీ వీసాకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో 40 రోజుల ముందే వీసా ప్రక్రియలో మార్పులు చేయడంతో భారతీయ ఐటీ కంపెనీలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కొత్తగా చేసిన మార్పుల వల్ల భారతీయ టెకీలకు వీసాలు రావడం కష్టమేనని తెలుస్తోంది.













