‘దిశ’కు నివాళులర్పించిన ఎన్నారైలు
హైదరాబాద్‌లో అమానుషంగా అత్యాచారానికి గురై మరణించిన వెటర్నరీ డాక్టర్ దిశకు ఎన్నారైలు శోకతప్తహృదయంతో నివాళులర్పించారు. డల్లాస్ నగరంలోని జాయి ఈవెంట్ సెంటర్ ఫ్రిస్కోలో శోకతప్త హదయాలతో ‘దిశ’ బంధువులు అభినవ్ రెడ్డి, సింధూరిలతో కలిసి డల్లాస్ ఫోర్టువర్థ్ కమ్యూనిటీ నాయకులు అంజలి ఘటించి, ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. ఇంతటి ఘాతుకానికి కారకులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి ఆకత్యాలు దేశవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నా న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల పునరావతమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.రాజకీయ స్వలాభం కోసం, రాజ్యాంగ సవరణలు చేయకుండా నాయకులు ఇలాంటి సంఘటనలను ఖండిస్తారే కానీ, దోషులను శిక్షించడానికి ఎన్నో సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో పాఠ్యాంశాలతో పాటు సందర్భానుసారంగా, ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ సిబ్బందికి ఆసుపత్రి సిబ్బందికి, దగ్గరలో ఉన్నవారికి సమాచారం అందజేసే విధంగా తగిన శిక్షణ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డా. ప్రసాద్ తోటకూర, అజయ్‌రెడ్డి, శ్రీధర్ కొరసపాటి, రావ్ కలవల, గోపాల్ పొన్నంగి, జానకి మందాడి, రఘువీర్ బండారు, పవన్ గంగాధర, చిన్న సత్యం వీర్నపు, పోలవరపు శ్రీకాంత్, చంద్ర పోలీస్, శారద సింగిరెడ్డి, మాధవి సుంకిరెడ్డి, ఇంద్రాణి పంచార్పుల, మాధవి లోకిరెడ్డి, అనురాధ మేకల, సుధాకర్ కలసాని, మామిడి రవికాంత్ రెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండల, వేణు భాగ్యనగర్, సుంకిరెడ్డి నరేష్, తెలకపల్లి జయ, మధుమతి వ్యాసరాజు, దీప్తి సూర్యదేవర, లింగారెడ్డి అల్వా తదితరులు పాల్గొన్నారు.













