తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో సీపీఆర్ సదస్సులు
తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తానా ఫౌండేషన్ అధ్యక్షులు డా. నల్లూరి ప్రసాద్ తెలిపారు. సిపిఆర్ సదస్సులను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర సమయంలో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నామని చెప్పారు. గుండెజబ్బు వచ్చిన వ్యక్తికీ తక్షణ సహాయం అందించే విషయంలో హైస్కూల్ విద్యార్ధులకు ఈ విషయమై తొలిదశలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం గుంటూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని త్వరలో క ష్ణాజిల్లాలో కూడా ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. విద్యార్ధులతో పాటు రెండో దశలో పోలీసులకు, అంబులెన్స్ డైరెక్టర్లకు శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ గా డా.ఈదర లోకేష్ కూడా వ్యవహరిస్తున్నట్లు ఆయన తెలిపారు.













