ఇమ్మిగ్రేషన్ పై సందేహాలను తీర్చిన తానా – ఎన్టీవీ షో
ఇటీవల ట్రంప్ తెచ్చిన ఆర్డినెన్స్ పై అనేకమందిలో ఏర్పడిన సందేహాలను తీర్చేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఇమ్మిగ్రేషన్ విషయంలో మంచి గుర్తింపు ఉన్న మూర్తి లా సంస్థతో కలిసి పలు సందేహాలను తీర్చింది. ఎన్టీవీలో ప్రసారమైన ఈ షోలో మూర్తి లా సంస్థకు చెందిన షీలా ఇమ్మిగ్రేషన్పై సవివరంగా విషయాలను తెలియజేశారు. పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 2010 నుంచి మూర్తి లా సంస్థతో కలిసి తానా పలు ఇమ్మిగ్రేషన్ సెమినార్లను నిర్వహించిన సంగతి తెలిసిందే. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి ఆదేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తానా నాయకుడు అశోక్బాబు కొల్లా తెలిపారు.













