వైట్ హౌస్ అధికారికి కరోనా
అమెరికా అధ్యక్షుడి నివాసమైన వైట్ హౌస్ లో పని చేసే అధికారికి కరోనా వైరస్ సోకింది. అమెరికా ఉపాధ్యక్షుడు మికీ ఫెన్సీ వద్ద పని చేస్తున్న అధికారికి కరోనా పాజిటివ్ అని తేఃలడంతో అతడిని హుటాహుటిన క్వారంటైన్ కు తరలించారు. అమెరికా దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. సాక్షాత్తూ వైట్ హౌస్ అధికారికే కరోనా సోకడంతో అమెరికన్లలో ఆందోళన రెట్టింపైంది. అయితే వైరస్ సోకిన వ్యక్తితో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కానీ, ఉపాధ్యక్షుడు పెన్స్ కానీ దరిదాపుల్లోకి రాలేదని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ కేటీ మిల్లర్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇటీవల ట్రంప్ కరోనా పరీక్షలు చేయించుకున్నా.. ఆ టెస్టులో వైరస్ సోకలేదని తేలింది.













