వణికిపోతున్న అగ్రరాజ్యం …
కరోన వైరస్ విజృంభిస్తున్న వేళ అమెరికా ప్రభుత్వం అక్కడి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలు, వైట్‌హౌస్ సహా ( అత్యవసర సేవలు మినహా) ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో సభలు, సమావేశాలు పెట్టుకోరాదని సూచించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఆపిల్, ఫేస్బుక్ తన ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని కోరాయి. వేలాది మంది ప్రయాణికులతో కిటకటలాడే న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, సియాటిల్, షికాగో విమానాశ్రయాల్లో ఇప్పుడు సందడి లేదు. ఒక రాష్ట్రంలో నుంచి మరో రాష్ట్రానికి, ఒక నగరం నుంచి మరో నగరానికి కూడా రాకపోకలు దాదాపు తగ్గాయి. సిలికాన్ వ్యాలీగా పేరొందిన శాన్‌జోస్, శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసే వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండటంతో రోడ్లు నిర్మానుష్యంగా కన్పిస్తున్నాయి. న్యూయార్క్‌లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు మాత్రమే తగిన జాత్రలతో విధులకు హాజరవుతున్నారు.













