జయ్ తాళ్ళూరి చేతుల మీదుగా కరోనా శతకం పుస్తకావిష్కరణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు జయ్ శేఖర్ తాళ్ళూరి చేతుల మీదుగా కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన కరోనా శతకం పుస్తకావిష్కరణ కార్యక్రమం న్యూయార్క్ నగరంలో ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు జరుగుతుందని చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలిపారు. గతంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన అమ్మానాన్న గురువు శతక పద్యార్చన కార్యక్రమాన్ని తానా ప్రపంచం అంతా ఒకేరోజు నిర్వహించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికానూ, ప్రపంచదేశాలను పీడిస్తున్న కరోనాపై కవి చిగురుమళ్ళ శ్రీనివాస్ రచించిన కరోనా శతకం పుస్తకాన్ని జయ్ తాళ్ళూరి నేడు ఆవిష్కరించనున్నారు.













