సీఎస్‌తో అమెరికా కాన్సులేట్ జనరల్ భేటీ
అమెరికా కాన్సులేట్ జనరల్ జోల్ రీఫ్‌మెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో సచివాలయంలో భేటీ అయ్యారు. తెలంగాణ, అమెరికా మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాల విషయమై ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. కాగా హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నిర్మాణం కావాల్సి ఉన్న అమెరికా వీసా కార్యాలయం విషయమై కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. సోమేష్‌కుమార్ కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.













