అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలు రద్దు
అమెరికా ఉత్పత్తులపై అదనపు సుంకాలను రద్దు చేసినట్టు చైనా ప్రకటించింది. వాస్తవానికి అదనపు సుంకాలు ఆదివారం నుంచి అమలులోకి రావలసి ఉంది. కాని రెండు దేశాలు వాణిజ్య యుద్దంపై పరస్పర అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో చైనా అదనపు సుంకాలను రద్దు చేసింది. కొన్ని రకాల అమెరికా ఉత్పత్తులపై విధించిన 10 శాతం, 5 శాతం అదనపు సుంకాలను చైనా రద్దు చేయనున్నది. అదే విధంగా అమెరికాలో తయరైన ఆటోలు, స్పేర్ పార్ట్‌లపై అదనపు సుంకాలను రద్దు చేసినట్టు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుంకాలను చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గిస్తూ, మేదో సంపత్తి హక్కలను రక్షణ కల్పించే విధంగా ఉన్న అమెరికా మిని ఒప్పందాన్ని అంగీకరించినట్టు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఒప్పందం రెండు పక్షాలు ఇంకా సంతకాలు చేయాల్సి ఉంది.













