అమెరికన్లపై వీసా ఆంక్షలు : చైనా
హాంకాంగ్‌లో జరిగిన అల్లర్ల విషయలో అతిగా స్పందించిన అమెరికాకు చెందిన వారిపై వీసా ఆంక్షలు విధిస్తామని చైనా ప్రకటించింది. హాంకాంగ్ నగరంలో స్వేచ్ఛను అరికట్టేందుకు అమెరికాకు చెందిన అధికారులే కారణమంటూ పేర్లు ప్రకటించకుండా, డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకుంది. నగరంలో అసమ్మతిని తొలగించేందుకు, నియంత్రణను మరింత కఠినతరం చేసేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని ఉపయోగించబడుతుందని తెలిపింది. చైనా విదేశాంగ శాఖ మంత్రి ఝావో లిజియన్ మాట్లాడుతూ అమెరికన్లపై విధించిన వీసాల ఆంక్షల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని ఆంక్షలు విధించడం సరికాదని కొందరు చైనా నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దేశ భద్రతతో పాటు హాంకాంగ్ స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ (హెచ్‌కే ఎస్ఏఆర్)లో శాంతి నెలకొల్పేందుకు ఆంక్షలు విధించినట్టు వివరించారు.













