అంధ క్రికెటర్ల జట్టు కు చికాగో ఆంధ్ర సంఘం మద్దతు
అమెరికాలో పర్యటిస్తున్న భారత అంధ క్రికెటర్ల జట్టు కు చికాగో ఆంధ్ర సంఘం వారు ఆగష్టు 18న నేపర్విల్ మాల్ ఆఫ్ ఇండియా లోని దావత్ బాంకెట్ హాల్లో పరిచయ సభ ఏర్పాటు చేసారు. సంస్థ 2024 అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి సహకారం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చికాగో ఆంధ్ర సంఘం వారి సేవ విభాగం చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల, సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, సలహాదారులు డా॥ ఉమా కటికి, సంస్థ స్పాన్సరు రమేశ్ తుమ్మ మరియు సంఘ బోర్డు సభ్యులు అంధ క్రికెటర్ల జట్టు కు విరాళం అందజేసారు. చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF) తరఫున సవితా మునగ, అనురాధ గంపాల సేవా థృక్పధం తో విరాళం గురించి త్వరిత నిర్ణయం తీసుకున్నందుకు అధ్యక్షురాలు శ్వేత వారికి కొత్తపల్లి కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరుకి చెందిన సమర్ధనం ట్రస్ట్, క్యాబి ఆధ్వర్యంలో అంధ క్రికెటర్ల జట్టు అమెరికాలో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్ పై అవగాహన కల్పించటం, 2028 పారా ఒలింపిక్స్ లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిథ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, బెంగుళూరు లో అంథుల కు క్రీడా స్టేడియం నిర్మాణానికి విరాళాలు సేకరించటం ఈ జట్టు చేస్తున్న పర్యటన ముఖ్యోద్దేశం.
మెంటార్ ధీరజ్ క్రికెట్ జట్టు లో ని క్రీడా కారులందరినీ పరిచయంచేయగా సంఘ బోర్డు సభ్యులు వారిని వేదిక పైకి ఆహ్వానించి పూలగుచ్చాలతో సత్కరించారు. అంధుల క్రికెట్లో మూడు కేటగిరిలను, వాటి విభజనను సభ్యులకు వివరించారు. ఈ మూడు గ్రూపుల ఆధారంగానే క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆటగాళ్ళు మన అందరికీ స్ఫూర్తి దాయకమని, చికాగో ఆంధ్ర సంఘం వారి మద్దతు అందిస్తామని అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి పేర్కొన్నారు.
సంఘం ట్రస్టీలు, స్పాన్సర్ర్లు, బోర్డు సభ్యులు – సవితా మునగ, అనురాధ గంపాల, శ్రీకృష్ణ మతుకుమల్లి, శైలజ సప్ప, అనూష బెస్త, శ్రీ స్మిత నండూరి, అన్విత పంచాగ్నుల, గిరి రావు కొత్తమాసు, ప్రభాకర్ మల్లంపల్లి, శ్రీనివాస్ పద్యాల, నరసింహారావు వీరపనేని మున్నగు వారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.







