అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలో పలుచోట్ల జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు సహా పలువురు గాయపడ్డారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఓ దుండగుడిని మట్టుబెట్టడంతో పాఠశాలలోని మిగతా విద్యార్థులు ప్రాణాలతో బయటపడగలిగారు. దుండుగుడు పాఠశాలలోకి చొరబడుతూ కాల్పులు జరపాలనుకున్నట్లు కాలిఫోర్నియా పోలీసులు వెల్లడించారు. దుండగుడు కాల్పులు జరిపిన తీరు చూస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతారనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాల్పులు జరపడానికి మీ ఆటోమేటిక్ రైఫిల్, రెండు హ్యాండ్ గన్నులు వాడినట్లు పోలీసులు పేర్కొన్నారు.













