కరోనా బాధితులను గుర్తించనున్న కుక్కలు
కుక్కలకు శిక్షణ ఇవ్వడం ద్వారా కరోనా వైరస్ ని ముందుగానే గుర్తించవచ్చని బ్రిటన్ కు చెందిన మెడికల్ డిటెక్షన్ డాగ్స్ (ఎండీడీ) అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఈ దిశగా శునకాలకు ఇప్పటికే శిక్షణ ప్రారంభించామని మరో ఆరు వారాల్లో శిక్షణ పూర్తవుతుందని ఈ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కారీ గెస్ట్ చెప్పారు. ఆరోగ్యకరంగా కనిపిస్తున్న వ్యక్తిలో దాగున్న వైరస్లనూ శునకాలు గుర్తించగలవని ఆమె తెలియజేశారు. గతంలో మలేరియాను గుర్తించేలా శునకాలకు లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ (ఎల్.ఎస్.హెచ్.టి.ఎమ్) శిక్షణ ఇచ్చి విజయవంతం అయిందని చెప్పారు.













