బైడెన్ కు అధికారమిస్తే హెచ్-1బీ వీసా వ్యవస్థ ప్రక్షాళన
అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్‌ను ఎన్నుకుంటే హెచ్-1బీ వీసా వ్యవస్థను ప్రక్షాళించి, గ్రీన్‌కార్డులకు దేశాల వారీగా ఉన్న కోటాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ప్రధానంగా భారతీయ అమెరికన్లను దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బైడెన్ తరపున ఈ మేరకు ప్రత్యేకంగా విధాన పత్రాన్ని విడుడుదల చేశారు. కుటుంబ ఆధారిత వలస విధానానికి ప్రోత్సాహం లభిస్తుందని, కుటుంబ ఏకీకరణకు మద్దతు ఇస్తామని బైడెన్ మద్దతుదారులు తెలిపారు. శాశ్వత వీసాల కోటాను కూడా పెంచుతామన్నారు.













