అమెరికాలో మరో నల్ల జాతీయుడు మృతి
అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతితో మిన్నంటిన ఆందోళనలు చల్లాకర ముందే మరో నల్ల జాతీయుడు పోలీసుల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నేపథ్యంలో అట్లాంటాలో మరోసారి పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆ నగర పోలీస్ చీఫ్ రాజీనామా చేశారు. రెషార్డ్ బ్రూక్ అట్లాంటాలోని ఓ రెస్టారెంట్ ముందు రాత్రి సమయంలో కారును నిలిపి అందులోనే నిద్రపోయాడు. ఈ విషయంపై పోలీసులకు ఆ రెస్టారెంట్ యజమాని ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడు మత్తులో ఉన్నట్లు తెలుసుకుని అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అతడు తిరగబడ్డాడు. అంతే కాకుండా ఓ పోలీసు తుపాకీని లాక్కొని పరుగులు తీశాడు. ఈ సమయంలో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.













