అమెరికా తెలుగు సంఘం (ఆటా)- నవలల పోటీ
2020 జులై 3, 4, 5 తేదీలలో జరగనున్న 16వ మహాసభల సందర్భంగా అమెరికా తెలుగు సంఘం నవలల పోటీ నిర్వహిస్తుంది.
బహుమతుల మొత్తం విలువ: 1,50,000 రూపాయలు
మొదటి బహుమతి: 1,00,000 రూపాయలు
రెండవ బహుమతి: 50,000 రూపాయలు
నవలలు అందవలసిన ఆఖరు తేదీ: మార్చి 31, 2020.
నిబంధనలు:
· ప్రపంచంలోని ఏ ప్రాంతమైనా నవలకు నేపథ్యం కావొచ్చు కానీ అది తెలుగువారి జీవితానికి సంబంధించినదై ఉండాలి.
· నవలకు పేజీల విషయంలో పరిమితి లేదు.
· ప్రపంచంలోని ఎక్కడి వారయినా ఈ పోటీకి నవలలు పంపవచ్చు.
· తెలుగులో డిటిపి చేసిన కాపీలను లేదా చేతిరాతను స్కాన్ చేసిన కాపీలను ఈమెయిల్ ద్వారా atanovels2020@gmail.com కు పంపాలి.
· నవలలు తమ స్వంతమనీ, అనువాదాలు, అనుసరణలు కాదనీ, గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదని, వేరే పత్రికల వద్ద పరిశీలనలో లేదనీ, ఫలితాలు వచ్చేవరకు ఎక్కడా ప్రచురింపబోమని పేర్కొంటూ రచయితలు హామీ పత్రం జతచేయాలి.
· నవల ప్రతి మీద రచయిత/రచయిత్రి పేరు ఉండకూడదు. రచయిత/రచయిత్రి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్ ఈమెయిల్ లో విడిగా రాయాలి.
· నవలల ఎంపికలో తుది నిర్ణయం ఆటా నిర్వాహకులదే. ఈ విషయంలో
ఉత్తర ప్రత్యుత్తరాలకు, వాద ప్రతివాదాలకు తావులేదు.
· నవలల పోటీ గడువు తేదీ పొడిగించే విషయంలో గానీ, పోటీ రద్దు చేసే
విషయంలో గానీ, బహుమతి మొత్తంలో మార్పులు చేసే విషయంలో
గానీ నిర్వాహకులకు సర్వహక్కులూ ఉన్నాయి.
· బహుమతి పొందిన నవలలను ప్రచురించే హక్కు ఆటాకు ఉంటుంది.
· నవలలు అందవలసిన ఆఖరు తేదీ: మార్చి 31, 2020.
· ఇతర వివరాలకు atanovels2020@gmail.com ఈమెయిల్ ద్వారా సంప్రదించండి.
పర్మేష్ భీంరెడ్డి (ఆటా అధ్యక్షులు)
నరసింహరెడ్డి ద్యాసాని(మహాసభల సమన్వయకర్త)
రవి వీరెల్లి (సాహిత్యవేదిక సమన్వయకర్త)













