డొనాల్డ్ ట్రంప్ కు భారతీయ విద్యార్థిని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారతీయ విద్యార్థిని దిమ్మతిరిగే షాకిచ్చింది. భూతాపానికి (గ్లోబల్‌వార్మింగ్), వాతావరణానికి (వెదర్) తేడా తెలీదా అంటూ చురక అంటించింది. ఈ నెల 21న వాషింగ్టన్లో చలి తీవ్రంగా విజృంభించింది. పాదరసం మైనస్-2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దీంతో దారుణమైన చలి అన్ని రికార్డులను తిరగరాసిందని, భూతాపానికి ఏమైందంటూ ట్రంప్ ట్వీట్ చేశారు. అసోంకు చెందిన బాలిక ఆస్థా శర్మ(18) ఈ ట్వీట్‌కు స్పందించింది. నేను మీ కన్నా 54 ఏళ్లు చిన్నదాన్ని. వాతావరణం, భూతాపం ఒకటి కాదని నేను మీకు చెప్పగలను. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సాయం కావాలంటే, నేను రెండో తరగతిలో చదువుకున్నా నా ఎన్సైక్లోపేడియాను మీకు ఇస్తాను. వాతావరణం, భూతాపానికి సంబంధించిన అన్ని విషయాలూ అందులో ఉన్నాయి అని ట్వీట్ చేసింది. ఈ కామెంట్‌కు 22 వేల లైక్‌లు వచ్చాయి.













