భూగర్భంలో నివాసాలకు అమెరికన్ల ప్రాధాన్యం
ఉత్తర కొరియా తీరుతో అమెరికా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో ఉత్తర కొరియా ఎప్పుడు న్యూక్లియర్ బాంబులు వేస్తుందోనన్న భయంతో ప్రజలు బంకర్ల బాటపట్టారు.బాంబుపేలుళ్లు జరిగినా ఎలాంటి హానీ కలగకుండా భూగర్భంలో నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో తమ ప్రాణాలకు రక్షణ కరువైందన్న భావనలో ఉన్న అమెరికన్లు బంకర్లను నిర్మించుకుంటున్నారు. దీంతో బంకర్లు నిర్మించే వారికి గిరాకీ పెరిగిపోయింది. బాంబు పేలుళ్లను సైతం తట్టుకునే 10 నుంచి 50 ఫీట్ల బంకర్ ధర లక్షా 10వేల అమెరికన్ డాలర్లు పలుకుతోంది. వినియోగదారులకు అనుకూలంగా బంకర్లు నిర్మిస్తే వీటి ధర మరింత పెరుగుతోంది. బంకర్లు నిర్మించే ముందే దానిలో ఉంచే ఫర్నీచర్, ఇతర సామాగ్రిని కూడా వాళ్లే సమకూరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఛార్జీలు వేస్తు న్నారు. ఇప్పటి వరకు టెక్సాస్,ఒరెగాన్, వాషింగ్టన్ ఇతర ప్రాంతాలకు డజన్ల సంఖ్యలో బంక ర్లను అమ్మినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధి తెలిపారు.













