ఇంకా ఆ సమయం రాలేదు : ట్రంప్
అణు క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని భయపెట్టిన ఉత్తరకొరియా అధినేత కిమ్‌ను తన దారికి తెచ్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దృష్టి సారించారు. ఇరాన్‌తో కూడా తమ సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సింగపూర్‌లో కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తగు సమయంలో ఇరాన్‌తో కూడా సంబంధాలు మెరుగుపడుతాయి. అందుకు సరైన సమయం రావాలి. ఆంక్షలు అమలవుతున్నాయి. మేము ఇరాన్‌పై పెట్టిన ఆంక్షలు చాలా కఠినంగా ఉన్నాయి. వారు తిరిగి వచ్చి ఒక వాస్తవ ఒప్పందం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా జరుగాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఇంకా ఆ సమయం రాలేదు అని అన్నారు.













