మరోసారి వెలుగులోకి ఫేస్బుక్ గోపత్యా లోపం
ఫేస్బుక్లో ఖాతాదారుల వ్యక్తిగత గోపత్య లోపం మరోసారి వెలుగులోకొచ్చింది. ఇందులో ఖాతాలున్న 41.9 కోట్ల మందికి చెందిన ఫోన్ నంబర్లు ఓ సర్వర్‌లో నిక్షిప్తమైనట్లు టెక్క్రచ్ అనే సైబర్ సెక్యూరిటీ సైట్ వెల్లడించింది. ఇందులో అమెరికాకు చెందిన ఖాతాలు 13.3 కోట్లు, వియత్నాంకు చెందినవి 5 కోట్లు, బ్రిటన్‌కు చెందినవి 1.8 కోట్లు ఉన్నాయని తెలిపింది. ఖాతాదారుల ఫోన్ నంబర్లు బహిర్గతం కావడంతో పాటు.. వారి లింగం, ఫేస్బుక్ విశిష్ట సంఖ్య, భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయని చెప్పింది. ఈ వివరాలు ఉన్న ఆ సర్వర్‌కు పాస్వర్డ్ రక్షణ కూడా లేదని పేర్కొంది.













