అమెరికాలో 5 కోట్ల మంది ఉపాధి గల్లంతు
అమెరికా అతి పెద్ద సంక్షోభం దిశగా పయనిస్తోంది. ఆర్థిక మాంద్యం, కరోనా మహమ్మారి ప్రతాపంతో ఇప్పటివరకు 5 లక్షల మంది ఉపాధి కోల్పోయి వీధినపడ్డారు. జులై 4తో ముగిసిన వారంలో సుమారు మరో 14 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అంచనా. నిరుద్యోగ భృతి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వరుసగా 16వ వారం కూడా 10 లక్షలకు పైగా ఉండటంతో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పున ప్రారంభించగానే, జూన్లో సుమారు 50 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందన్న ట్రంప్ మాటల్లో ఏమాత్రం నిజం లేదని ఈ సర్వే ఫలితాలు సృష్టం చేస్తున్నాయి.













