అమెరికాలో మరోసారి కలకలం
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆగ్నేయ వాషింగ్టన్‌లోని అనకోస్టియా ప్రాంతంలోని గుడ్‌హోప్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసు అధికారి పమేలా స్మిత్ తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒక మహిళ ఉన్నారు. శనివారం రాత్రి కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుందని, వారిని భయాందోళనకు గురి చేయాలనే ఉద్దేశంతోనే నిందితుడు ఈ చర్యకు పాల్పడి ఉంటాడని స్మిత్ అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 150 మందికి పైగా కాల్పుల ఘటనల్లో మృతి చెందారు.













