అమెరికాలో దారుణం …
అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్యకు గురైంది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో చదువుతున్న రూత్ జార్జ్ (19)పై ఈ నెల 22న అత్యాచారం, హత్య జరిగినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. 23న రూత్ జార్జ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. క్యాంపస్ సమీపంలో ఉండే డొనాల్డ్ తుర్మాన్ ఈ ఘాతానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. ఈ నిందితుడు ఓ దొంగతనం కేసులో గతంలో ఆరేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన రూత్ జార్జ్ కుటుంబం 20 ఏళ్ల క్రితం చికాగోలో స్థిరపడింది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో ఆనర్స్ స్టూడెంట్‌గా ఉన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు యూనివర్సిటీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం సాయంత్రం మృతదేహాన్ని క్యాంపస్ గ్యారేజ్‌లోని ఆమె కారు వెనుక సీట్లో గుర్తించారు.













