అమెరికాలో భారత కంపెనీల హవా
భారతీయ కంపెనీలు అమెరికాలోనూ పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలను సృష్టిస్తూ సత్తా చాటుతున్నాయి. 155 భారతీయ కంపెనీలు అమెరికాలో 1.6 లక్షల కోట్లు (22 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టాయి. ఇది అమెరికాలో 1.25 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సిఐఐ) విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లో 155 భారతీయ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయి. ఇండియన్ రూట్స్, అమెరికన్ సాయిల్ 2020 పేరుతో ఉన్న ఈ నివేదికలో వాషింగ్టన్ డీసీ, ప్యూర్టో రికోతో సహా మొత్తం 50 యూఎస్ రాష్ట్రాల్లో 155 భారతీయ కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయని పేర్కొంది.
టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఫ్లోరిడా ఈ భారతీయ కంపెనీలకు నిలయంగా ఉన్నాయి. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సంస్క•తి, ఆర్థిక వ్యవస్థ, శాస్త్రానికి భారతీయ-అమెరికన్లు పెద్ద కృషి చేశారని యూఎస్ సెనేటర్ జాన్ కార్నిన్ చెప్పారు.













