టాక్సిక్‌లో యష్ పాత్ర ఎలా ఉంటుందంటే..!
కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ పాపులరైన యష్ తర్వాత పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు. కన్నడలో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక హీరోగా యష్ కు రికార్డుంది. గోల్డ్ మైన్స్ మాఫియాతో పోరాడే గ్యాంగ్‌స్టర్ గా యష్ కేజీఎఫ్ సినిమాలో నటించి మెప్పించాడు. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు సినిమాలు కలిపి రూ.1400 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించాడు యష్.
కేజీఎఫ్2 తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను మొదలుపెట్టాడు యష్. టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుంది. గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు డైరెక్టర్. 1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి లాంటి భారీ తారాగణమే ఉంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ప్రస్తుతం నెట్టింట ఓ ప్రచారం జరుగుతుంది. టాక్సిక్ లో యష్ చాలా భయంకరమైన గ్యాంగ్‌స్టర్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమా డ్రగ్ మాఫియా చీకటి కోణాన్ని బహిర్గతం చేస్తుందని, ముఖ్యంగా 1940-1970ల వరకు మాఫియా ఎలా ఏలిందో అనే విషయాన్ని తెరపై చూపించనున్నారట. యష్ ఇంతకుముందు చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని ఇంకా చెప్పాలంటే కేజీఎఫ్ లో రాఖీ భాయ్ కంటే పవర్ఫుల్ పాత్రలో కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది.













