కన్నడ రాక్‌స్టార్‌కు క్రేజీ సెంటిమెంట్
కెజిఎఫ్2తో రూ.1000 కోట్ల కలెక్షన్స్ అందుకున్న మొదటి కన్నడ హీరోగా యష్ రికార్డు సృష్టించాడు. ఈ సినిమాతో యష్ దేశవ్యాప్తంగా పాపులరయ్యాడు. దీంతో దేశం మొత్తం యష్ నెక్ట్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కెజిఎఫ్2 తర్వాత ఎంతో గ్యాప్ తీసుకుని తన తర్వాతి సినిమాను గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో అనౌన్స్ చేశాడు యష్.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీకి టాక్సిక్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రీసెంట్ గానే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులు ఈ సినిమా ఎందుకు మొదలవలేదనేది ఎవరికీ తెలియదు. కానీ దీనికి సంబంధించిన రీజన్ ఇదేనంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.
యష్ లక్కీ నెంబర్ 8 అని అందుకే 8వ నెల 8వ తేదీన ఈ సినిమా షూటింగ్ లో యష్ జాయిన్ అయ్యాడని, 2024లో మొత్తం కలిపినా కూడా 8 వస్తుంది. ఈ సెంటిమెంట్ వల్లే కన్నడ రాక్‌స్టార్ యష్ ఇన్నాళ్లు వెయిట్ చేశాడని అంటున్నారు. వాస్తవానికి న్యూమరాలజీని నమ్మే వారు దీన్ని బాగా ఫాలో అవుతారు. దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.













