ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్
అవును ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు ప్రేమికుల దినోత్సవాన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్. ఓ షెడ్యూల్ మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ త్రేసా, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.













