న్యూయార్క్ లో విమెన్ ఇన్ ది వరల్డ్ కార్యక్రమం
ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రపంచ వేదికపై తన గళం వినిపించబోతోంది. అంతర్జాతీయంగా పలు రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన మహిళలు వివిధ అంశాలపై తమ వాణిని వినిపించేందుకు ఉద్దేశించిన విమెన్ ఇన్ ది వరల్డ్ కార్యక్రమంలో వక్తగా పాల్గొనబోతోంది. న్యూయార్క్లో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగే ఈ సమావేశంలో ప్రియాంకతో పాటు ఆస్కార్ పురస్కార విజేత బ్రీ లార్సన్, అమెరికా వ్యాపారవేత్త సిండీ మెక్కెయిన్ లాంటి మహిళలు ప్రసంగించనున్నారు. మీటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం, పాత్రికేయ విలువలను పరిరక్షించడం తదితర అంశాలపై వారు తమ భావాలను పంచుకోనున్నారు.













