Rashmika Mandanna: రష్మిక అయినా ఆ అపవాదుని తొలగిస్తుందా?
ఒకప్పుడు టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు బాగా క్రేజ్ ఉండేది. ఆ క్రేజ్ ను వాడుకుని విజయశాంతి(vijayasanthi) నుంచి అనుష్క(anushka) వరకు ఎంతోమంది సూపర్హిట్లను తమ అకౌంట్స్ లో వేసుకోవడంతో పాటూ నటిగా మంచి క్రేజ్ కూడా సంపాదించుకున్నారు. కానీ ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు క్రేజ్ తగ్గుతూ వస్తుంది. దానికి రీసెంట్ గా రిలీజైన రెండు సినిమాలే ఎగ్జాంపుల్.
ఆ సినిమాలు మరేవో కాదు. ఒకటి 8 వసంతాలు(8 Vasanthalu), రెండోది పరదా(paradha). ఫణీంద్ర నర్సెట్టి(Phaneendra narsetti) దర్శకత్వంలో జూన్ 20న కుబేర(Kuberaa) సినిమాతో పాటూ వచ్చిన 8 వసంతాలు సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) బ్యాకప్ ఉన్నప్పటికీ ఆ సినిమా ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఆఖరికి 8 వసంతాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపుగానే మిగిలింది.
ఇక రీసెంట్ గా అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) ప్రధాన పాత్రలో ప్రవీణ్ కండ్రేగుల(praveen kandregula) దర్శకత్వంలో వచ్చిన సినిమా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ రెండు సినిమాల్లో నటించిన హీరోయిన్లకు మంచి పేరు వచ్చినప్పటికీ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు మాత్రం నష్టాన్నే మిగిల్చాయి. అయితే కేవలం ఈ రెండు సినిమాలను లెక్కలోకి తీసుకుని ఆడియన్స్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఆసక్తి తగ్గిందని చెప్పలేం. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చిన్న బడ్జెట్ సినిమాలను తీయడంలో ఫెయిలవుతుంది. ఇంకా చెప్పాలంటే బలగం(balagam), కోర్టు(Court) లాంటివి తప్ప ఆడియన్స్ నుంచి మంచి మార్కులేసుకున్న సినిమాలేమీ లేవు. త్వరలోనే రష్మిక(rashmika) నుంచి ది గర్ల్ ఫ్రెండ్(the girl friend) రాబోతుంది. ఆ సినిమా అయినా ఆడియన్స్ కు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఉన్న అపవాదులను తొలగిస్తుందేమో చూడాలి.







