రాజమౌళి ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ మెరుపు వేగంతో సాగుతోంది. ఈ చిత్ర నిర్మాణ పనులు ఇప్పటికే దాదాపు 90 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో మహేష్ బాబు భారీ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతుండగా, ఇది పూర్తయితే ఆయన పోర్షన్ మొత్తం కంప్లీట్ కానుంది. సాధారణంగా షూటింగ్ పూర్తయ్యాకే పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టే రాజమౌళి, ఈ సినిమా కోసం సమాంతరంగా వీఎఫఎక్స్, ఎడిటింగ్, డబ్బింగ్ పనులను హాలీవుడ్ తరహాలో నడిపిస్తున్నారట. సినిమా అంటే కథ, కథనం, నటీనటులు, సాంకేతిక హంగులు.. ఇవన్నీ ఎంత ముఖ్యమో, ప్రేక్షకుల్లో ఆ సినిమాపై సరైన సమయంలో ఆసక్తిని పెంచడం కూడా అంతే కీలకం. ముఖ్యంగా రాజమౌళి వంటి డైరెక్టర్ సినిమా విషయంలో సహజంగానే భారీ అంచనాలు ఏర్పడతాయి. అయినప్పటికీ వారణాసి మూవీ విషయంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను చాలా వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రాజమౌళి సినిమాకు స్పెషల్‌గా హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదని సాధారణంగా అందరూ అభిప్రాయపడుతుంటారు. ఆయన సినిమా నుంచి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో భారీ డిస్కషన్ మొదలవుతుంది. కానీ వారణాసి మూవీ స్థాయి, మహేష్ బాబు క్రేజ్, అంతర్జాతీయ స్థాయిలో సినిమాపై ఉన్న ఆసక్తి దృష్ట్యా.. ఈసారి కేవలం హైప్ సరిపోదని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలను ఒక్కసారిగా పెంచడం కంటే, వాటిని దశలవారీగా మరింత ఎత్తుకు తీసుకెళ్లేలా ప్రమోషనల్ ప్లాన్ రూపొందిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. అంటే ప్రతి అప్డేట్ను ఒక రెగ్యులర్ పోస్టర్ లేదా అనౌన్స్మెంట్లాగా కాకుండా.. ఒక ఈవెంట్‌గా మార్చే ప్రయత్నం చేయబోతున్నారనిపిస్తోంది.
పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న కుంభ పాత్రపై ఇప్పటికే క్యూరియాసిటీ ఉంది. రాజమౌళి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ కేవలం హీరోను ఎదుర్కొనే వ్యక్తిగా కాకుండా.. కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా కనిపించడం కొత్తేమీ కాదు. బాహుబలిలో భల్లాలదేవ, ఆరఆరఆర్లో స్కాట్ వంటి పాత్రలు కథలో సంఘర్షణకు బలమైన పునాది వేశాయి. దీంతో వారణాసిలో కుంభ పాత్ర కూడా కేవలం విలన్ షేడ్కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపులకు కారణమవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అందుకే వారణాసి మూవీకి సంబంధించిన అసలు పరీక్ష షూటింగ్ పూర్తవడంలో కంటే.. ఇకపై ప్రేక్షకుల అంచనాలను ఎలా నడిపిస్తారనే విషయంలోనే ఉందని చెప్పొచ్చు.
టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు అభిమానులతోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న ఎసఎస్ రాజమౌళి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ వారణాసి. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్, మాధవన్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ జోనర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.








