ప్లాప్ ఇచ్చిన దర్శకుడితో మరోసారి మహేష్ సినిమా చేస్తాడా?
సూపర్ స్టార్ మహేష్ బాబు జయాపజయాలు పక్కన పెడితే ఒక డైరెక్టర్ చెప్పిన కథ నచ్చితే ఆ సినిమా చేసేటప్పుడు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వడు. డైరెక్టర్ ఏది చెప్తే అదే ఫాలో అవుతాడు మహేష్.. అలా చాలా విజయాలు సాధించాడు అలాగే పరాజయాలు కూడా సాధించాడు.కానీ మహేష్ కు ఓ డిజాస్టర్ సినిమా ఇస్తే… అది ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే… మరోసారి ఆ డైరెక్టర్ జోలికి పోడు మహేష్. గతం లో కొందమంది దర్శకులతో అతని అనుభవం వుంది ప్రస్తుతం మంచి ఫామ్ ఉన్నాసరే మళ్లి వారి జోలికి వెళ్ళలేదు యువరాజు తర్వాత వై వి యస్ చౌదరి తో, ‘టక్కరి దొంగ’ చిత్రంతో జయంతి సి పరాన్జీ ని, ‘సైనికుడు’ చిత్రం చేసిన గుణశేఖర్ తో, ‘అతిథి’ తరువాత సురేందర్ రెడ్డి తో ‘ఖలేజా’ తరువాత త్రివిక్రమ్ తో, ‘ఆగడు’ చిత్ర దర్శకుడు శ్రీను వైట్లతో కానీ… ‘1 నేనొక్కడినే’ తరువాత సుకుమార్ తో, ‘బ్రహ్మ్మోత్సవం’ తర్వాత శ్రీకాంత్ అడ్డాల ఇలా ఏ దర్శకుడితో మళ్ళీ ఏ డైరెక్టర్ తోనూ మళ్ళీ సినిమా చెయ్యడానికి మహేష్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే తనకి ‘స్పైడర్’ వంటి డిజాస్టర్ ఇచ్చిన ఇచ్చిన మురుగదాస్ తో మహేష్ బాబు సినిమా ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ లో కలవరం మొదలైంది. వివరాల్లోకి వెళితే… ఇటీవల మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో “విజయ్ తో సినిమా పూర్తయ్యాక…. మరో మారు మహేష్ బాబు తో సినిమా చేస్తాను. అందుకోసం ఓ కథ కూడా రెడీ చేసుకున్నానని త్వరలోనే మహేష్ ను కలిసి కథ వినిపిస్తాను.” అన్నాడు. స్వతహాగా మురుగదాస్ మహేష్ బాబు కి పెద్ద ఫ్యాన్. ఆయన కోరిక మేరకు చాలా సంవత్సరాల తర్వాత స్పైడర్ సినిమా చేశాడు. ఈ సినిమా బాగున్నా కాని క్రిటిక్స్ తప్పుడు రివ్యూ లు వల్ల తెలుగులో ప్లాప్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ అయ్యింది. అన్న అభిప్రాయం లో వున్నాడు మురుగదాస్. ఎలాగైనా మహేష్ కి మంచి హిట్ ఇస్తానని చాలా సందర్భాల్లో చెప్పాడు మురుగదాస్. అయితే ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్లో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్న మహేష్ ఆ తరువాత రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తాడు అని ఫ్యాన్స్ ఎంతో ముచ్చటపడుతున్నారు. ఇలాంటి టైం లో మురుగదాస్ తో సినిమా అంటే వాళ్ళు కూడా కంగారు పడతారు మరి. అయితే మహేష్ … అసలు మురుగదాస్ చెప్పే కథ వినడానికి అయినా టైం ఇవ్వాలి కదా…! మురుగదాస్ అంటే మహేష్ కి కూడా అభిమానమే. తనకు ఒక ప్లాప్ ఇచ్చిన కాని.. ఆ మధ్య మురుగదాస్ తీసిన ‘సర్కార్’ సినిమా బాగుందని తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. ఆ మంచితనం వల్లే మురుగదాస్ మహేష్ కి మంచి హిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. మరి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో వేచి చూడాలి.













