ఖుష్బూకి ఆమె ఫ్యాన్స్ మళ్లీ గుడి కట్టిస్తారా?
సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అందంతోపాటు అభినయం కూడా తోడైతే వారి కెరీర్‌కి ఢోకా ఉండదు. ఒకప్పుడు హీరోయిన్లు బొద్దుగా ఉండేవారు. అప్పట్లో అలా ఉంటేనే ఆడియన్సకి నచ్చేది. ఇప్పుడలా కాదు, సన్నగా మెరుపుతీగలా ఉండాలి. ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు తమను తాము మలుచుకోవడం హీరోయిన్లకు పెద్ద కష్టమైన పనిగా మారింది. ఈమధ్యకాలంలో రాశీఖన్నా, మెహరీన్ వంటి హీరోయిన్లు హెవీగా ఉన్న తమ ఫిజిక్‌ని బాగా తగ్గించుకొని సన్నబడ్డారు. ఇప్పుడు ఇలా ఉన్నాము అంటూ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్లుగా నటిస్తున్న వారైతే ఎన్ని వర్కవుట్స్ అయినా చెయ్యొచ్చు, ఎంత నాజూకుగా అయినా కనిపించవచ్చు.
దానికోసం ఎంతైనా కష్టపడొచ్చు. కానీ, ఒకప్పటి హీరోయిన్ ఖుష్బూకి ఆ అవసరం ఉందంటారా? ఆమెని అడిగితే ఉందనే అంటుంది. ఎందుకంటే ఫిట్‌గా ఉండడం అందరికీ మంచిదే. అది రన్నింగ్‌లో ఉన్న హీరోయిన్లే చెయ్యాలన్న రూల్ ఎక్కడా లేదు కదా. అందుకే ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే బాగా వర్కవుట్స్ చేసి సన్నబడింది. దాదాపు 15 కేజీల బరువు తగ్గిందట. ఆమెతోపాటు ఆమె కూతురు కూడా వర్కవుట్ చేసి సన్నబడింది. ఖుష్బూ తన కెరీర్ తొలినాళ్లలో ఎలా ఉండేదో అలా కనిపించడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. 1980లో వచ్చిన హిందీ మూవీ `ది బర్నింగ్ ట్రైన్` చిత్రంతో ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన ఖుష్బూ ఆ తర్వాత హిందీతోపాటు తెలుగు, తమిళ్, కన్నడ మలయాళ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేశారు. అయితే తమిళ్లోనే ఆమె ఎక్కువ సినిమాలు చేశారు. ఆమె హీరోయిన్గా టాప్‌లో ఉన్న రోజుల్లో తమిళనాడులోని ఆమె అభిమానులు ఆమె కోసం ఒక గుడి కట్టించిన విషయం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఆ తర్వాత బొద్దుగా మారిన ఖుష్బూ ఇప్పుడు మళ్లీ సన్నబడి నాజూకుగా తయారైంది. మరి ఆమె అభిమానులు ఇప్పడు కూడా ఆమెకు గుడి కట్టించే ప్రయత్నం చేస్తారా?













