మరోసారి వాయిదా పడనున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి?
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఎప్పుడు రిలీజవుతుందోనని విశ్వక్ సేన్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. అప్పట్లో డిసెంబర్ లో తన సినిమా రిలీజ్ కాకపోతే ప్రమోషన్స్ లో పాల్గొనని శపథం చేసిన విశ్వక్, తర్వాత సిట్యుయేషన్స్ ను అర్థం చేసుకుని ఈ సినిమాకు సంబంధించిన బ్యాలెన్స్ షూట్ లో పాల్గొంటున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా మార్చి 8న రిలీజ్ కావాల్సింది.
కానీ ఇప్పుడు ఆ టార్గెట్ ను అందుకోవడం కష్టంగానే ఉందంటున్నారు చిత్ర యూనిట్ వర్గాలు. డైరెక్టర్ ఈ సినిమా ను టైమ్ కు రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో రాత్రిపగలు తేడా లేకుండా పని చేస్తున్నాడు. అయినా కానీ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి డౌట్ అనే అంటున్నారు. దీంతో ఆ డేట్ పై కర్ఛీఫ్ వేసేందుకు మరికొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి.
ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న గం గం గణేశా సినిమా మార్చి 8ని టార్గెట్ చేసుకుంది. మరో వైపు గోపీచంద్ భీమా కూడా అదే రోజున రానుంది. రామ్ పోతినేని హీరోగా రానున్న డబుల్ ఇస్మార్ట్ అన్నింటికంటే ముందే ఈ రోజును ఫిక్స్ చేసుకుంది కానీ ఇప్పుడు డేట్ మారడం దాదాపు ఖాయమంటున్నారు, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. మహా శివరాత్రి కావడంతో ఈ డేట్ పై పోటీ బాగా పెరుగుతుంది. ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మళ్ళీ వాయిదా పడితే మళ్ళీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాలి. ఏదేమైనా సోలో రిలీజ్ కోసం చూస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి రిలీజ్ డేట్ విషయంలో బాగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.













