Anirudh: అనిరుధ్ ఈసారైనా మ్యాజిక్ చేస్తాడా?
ఏ సినిమా ఎందుకు లేటవుతుందో ఎవరూ చెప్పలేరు. చేతిలో పలు సినిమాలుండటం వల్ల ఎప్పుడో కమిట్ అయిన సినిమాకు వర్క్ చేయలేకపోతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander). కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఏదైనా మూవ చేస్తున్నాడంటే దాని కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తమిళంలోనే కాకుండా అనిరుధ్ కు తెలుగులో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోలు కూడా అనిరుధ్ తో కలిసి వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్ వల్ల గత కొంతకాలంగా ఓ సినిమా వెనుకబడుతూ వస్తుంది. అదే మ్యాజిక్(Magic). గౌతమ్ తిన్ననూరి(Gowtham thinnanuri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) బ్యానర్ లో తెరకెక్కిన ఈ మూవీ మ్యూజిక్ వల్ల డిలే అవుతూ వస్తుంది.
అనిరుధ్ మ్యాజిక్ తర్వాత పలు సినిమాలను ఒప్పుకుని, వాటి మ్యూజిక్ ను పూర్తి చేసి రిలీజ్ కూడా అవగా, మ్యాజిక్ మాత్రం ఇంకా అనిరుధ్ వర్క్ కోసం వెయిట్ చేస్తూ ఉంది. చాన్నాళ్లుగా పెండింగ్ లోనే ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, 2026 ఫస్టాఫ్ లో మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి అనిరుధ్ ఇప్పుడైనా మ్యాజిక్ ను తన వర్క్ ను పూర్తి చేస్తారో లేదో చూడాలి.







