టాటా బయోపిక్ కు ఎవరు పూనుకుంటారో?
రతన్ టాటా(Ratan Tata) కన్నుమూత కోట్లాది ప్రజలను కలచివేసింది. భారత దేశానికి పారిశ్రామిక విప్లవం రావడానికి కీలక పాత్ర పోషించిన ఈ బిజినెస్ టైకూన్ తన జీవితం మొత్తంలో ఎక్కువ శాతం సమాజం కోసమే ఆలోచించాడు. జనం కోసం ఎంతో ఆలోచించి తను బిజినెస్ చేశారు తప్పించి లాభాల కోసమో, తన సంపదను విస్తృత పరచుకోవడానికో మాత్రం చేయలేదు.
అందుకే ఆయనకెన్ని అవార్డులొచ్చినా, ఎంత ఆస్తి ఉన్నా ఎప్పుడూ సామాన్యుడిగా ఉండేందుకే పరితపించేవాడు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి తర్వాతి తరాలకు చెప్పాల్సిన బాధ్యత అందరి మీదా ఉంది. దానికి సరైన మీడియం సినిమానే. రతన్ టాటా బయోపిక్‌ను తెరమీదకు తీసుకురాగలిగితే ఎన్నో తరాలకు ఆ సినిమా ఓ గొప్ప రిఫరెన్స్ గా నిలుస్తుంది.
కొన్నేళ్ల కిందట మాధవన్(Madhavan) లేదా అభిషేక్ బచ్చన్(Abhishek Bachan) తో రతన్ టాటా బయోపిక్ ను డైరెక్టర్ సుధా కొంగర(Sudha kongara) తీసే ప్రయత్నం చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఆ వార్తల్ని ఆమె తర్వాత కొట్టిపారేసింది. కాబట్టి ఇప్పుడెవరైనా ఈ సినిమా తీయడానికి పూనుకుని పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను తీస్తే బావుంటుంది. రతన్ టాటా గురించి చెప్పగలగడం కంటే గర్వ కారణం ఎవరికైనా ఏముంటుంది? త్వరలోనే ఆయనపై బయోపిక్ రావాలని కోరుకుందాం. దీని కోసం ఇంకొంత కాలం వెయిట్ చేయక తప్పదు.













