అనగనగా ఒక రాజు కొత్త డైరెక్టర్ ఎవరంటే..?
ఓ సినిమా స్టార్ట్ అయ్యాక మధ్యలో చేతులు మారడం, టెక్నీషియన్లు మారడం చాలా కామనైపోయింది ఈ రోజుల్లో. మహేష్ నో చెప్పిన తర్వాతే సుకుమార్ పుష్ప ను బన్నీ కి సెట్ చేశాడు. బన్నీ వద్దన్న స్టోరీతోనే ఎన్టీఆర్ తో కొరటాల దేవర చేస్తున్నాడు. ఇప్పుడు అలానే హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లతో మంచి ఊపు మీదున్న నవీన్ పోలిశెట్టి నుంచి వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు సినిమా గతేడాదే స్టార్ట్ అయింది.
ఈ సినిమా కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. కానీ మధ్యలో ఏమైందో తెలియదు కానీ బ్రేక్ పడింది. ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు ఈ సినిమాకు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఈ సినిమా ఆగిపోయే సూచనలున్న టైమ్ లో కళ్యాణ్ శంకర్‌కు మ్యాడ్ సినిమాను అప్పగించి దానికి డైరెక్షన్ చేసే ఛాన్స్ ఇచ్చారు. కట్ చేస్తే మ్యాడ్ మూవీ ఇవాళ థియేటర్లలో మంచి హిట్ గా రన్ అవుతుంది.
ఇప్పడు మధ్యలో ఆగిపోయిన అనగనగా ఒక రాజు సినిమాను జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్‌కు ఇచ్చినట్లు తెలుస్తోంది. అఫీషియల్ గా సినిమాను ప్రకటించలేదు కానీ రెండు మూడు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు హీరోయిన్ గా శ్రీలీల ను అనుకున్నారు. మరి ఈ కొత్త కాంబోలో హీరోయిన్ గా ఆమే నటిస్తుందా లేదా వేరే హీరోయినా అనేది తెలియాల్సి ఉంది.













