ఖైదీ2 ఎప్పుడు తీస్తావు లోకేష్?
కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమా ఎంత సెద్ద పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కార్తీ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌తోనే లోకేష్ స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఆ తర్వాత మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు లోకేష్.
వీటిలో ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే వచ్చాయి. ఖైదీ సీక్వెల్ కోసం అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. ఖైదీకి సీక్వెల్ ఉంటుందని లోకేష్ కూడా చాలా సందర్భాల్లో క్లారిటీ ఇచ్చాడు. విక్రమ్ మూవీ తర్వాత ఖైదీ2 చేస్తారనుకున్నారు. కానీ విజయ్ తో లియో చేసే ఛాన్స్ రావడంతో దాన్ని మొదలుపెట్టాడు లోకేష్.
లియో తర్వాత ఖైదీ2 ఉంటుందనుకుంటే లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి సినిమాను అనౌన్స్ చేశాడు. కూలి సినిమా కూడా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే తెరకెక్కుతుంది. కూలి తర్వాత అయినా లోకేష్ ఖైదీ2 చేస్తాడా అని ఇప్పుడు ఫ్యాన్స్ లో అనుమానాలు కలుగుతున్నాయి. కూలి తర్వాత లోకేష్, బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తో సినిమా చేయనున్నాడని, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుందని ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ ఒకవేళ అమీర్ తో సినిమాను లోకేష్ మొదలుపెడితే మాత్రం ఖైదీ2 మరోసారి వెనక్కు వెళ్లడం గ్యారెంటీ అని అంటున్నారు. ఖైదీలో చెప్పకుండా వదిలేసిన స్టోరీ లైన్ ను ఎప్పుడెప్పుడు లోకేష్ చెప్తాడా అని ఖైదీ2 కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటే అది ఎప్పటికప్పుడు వెనక్కెళ్తూనే ఉంది.













