అఖిల్ నెక్ట్స్ ఇంకెప్పుడు?
అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ డిజాస్టర్ టాక్ తో చాలా ట్రోలింగ్స్ ను ఎదుర్కొంది. ఇదంతా ప్రతి హీరోకు ఏదొక దశలో ఎదురయ్యే అనుభవమే. కానీ అఖిల్ మాత్రం ఇంకా ఏజెంట్ తాలూకు గాయాల నుంచి బయట పడలేదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే ఏజెంట్ వచ్చి 11 నెలలవుతోంది. అయినా సరే అఖిల్ తన నెక్ట్స్ సినిమాను ఇప్పటికీ మొదలు పెట్టలేదు.
నాగ్ నా సామిరంగతో తిరిగి ట్రాక్ ఎక్కగా, నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమాపై క్రమంగా హైప్ పెరుగుతుంది. కానీ అఖిల్ మాత్రం ఇంకా సినిమాను అనౌన్స్ చేయలేదు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అనిల్ డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఇప్పటికే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇప్పటికే ఓకే అయింది. అదిగో ఇదిగో అంటున్నారు తప్పించి ఫలానా టైమ్ లో స్టార్ట్ చేస్తామని మాత్రం చెప్పడం లేదు.
ఇదే బ్యానర్ లో చాలా లేట్ గా ఓకే అయిన విశ్వంభర సినిమాను యువీ క్రియేషన్స్ సంస్థ చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఇది కాకుండా అనుష్క- డైరెక్టర్ క్రిష్ కాంబోలో మరో సినిమాను కూడా చేయడానికి యువి బ్యానర్ లైన్ క్లియర్ చేసుకుంది. కానీ అఖిల్ సినిమాను మాత్రం ఇప్పటికీ ముందుకు తీసుకెళ్లడం లేదు. స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిగా ఉండటం వల్లే సినిమా లేటవుతుందని ఫైనల్ వెర్షన్ రెడీ అవగానే సినిమాను అనౌన్స్ చేస్తారని అంటున్నారు.













